● పటోళ్ల సురేందర్‌రెడ్డి నాయకత్వంలో రిలే నిరాహార దీక్షలు
● 12వ రోజు దీక్షలో శేరుపల్లి మల్లేష్, రామయ్య
● ఉద్యమకారుల హామీలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్
అల్వాల్, సెప్టెంబర్ 28: తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ అల్వాల్ సర్కిల్ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ పటోళ్ల సురేందర్‌రెడ్డి నాయకత్వంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 12వ రోజుకు చేరుకున్నాయి.
12వ రోజు దీక్షలో శేరుపల్లి మల్లేష్, రామయ్య కూర్చున్నారు. ముఖ్య అతిథులుగా మంచిర్యాల కోల్‌బెల్ట్ టీయూఏజేఏసీ కన్వీనర్ నారాయణరాజు, తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి బండపల్లి శివశరణప్ప పాల్గొన్నారు.
పటోళ్ల సురేందర్‌రెడ్డి, పుట్నాల కృష్ణ, దయాకర్, ముత్యాలు, నగేష్, రమేష్, సత్తయ్య తదితరులు హాజరై దీక్షకు సంఘీభావం తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలులో కాలయాపన చేయకుండా తక్షణ చర్యలు చేపట్టాలని వారు కోరారు.
#Sidhumaroju
Alwal










