పెండ్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే సౌమ్య

0
4

Tangirala Soumya కంచికచర్ల మండలంలోని పెండ్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టి, మెడికల్ స్టాక్ రూమ్‌ను పరిశీలించి, రోగులతో మాట్లాడి వైద్య సేవల నాణ్యత, ఔషధాల లభ్యతపై వివరాలు తెలుసుకున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయాలని, సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. “కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం” అని అధికారులు పేర్కొంటూ, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీల రాష్ట్ర ఉపాధ్యక్షులు కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, కూటమి నేతలు, స్థానిక వైద్య సిబ్బంది పాల్గొన్నారు.