ప్రజల సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్

0
4

కంచికచర్ల మండలం వేములపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధికారులు, కూటమి నేతలతో కలిసి పాల్గొన్నారు. గ్రామ ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెన్షన్లు, గృహ నిర్మాణం, రేషన్, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నప్పటికీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తోందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.