22 భూ సమస్యల పరిష్కారంలో ఏలూరు జిల్లా రాష్ట్రానికి ఆదర్శం

0
1

రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో ఏలూరులో 22ఏ మెగా పరిష్కార మేళా విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 22ఏ జాబితా నుండి 74 ఎకరాల భూమిని తొలగించి, 290 మంది రైతులకు అప్పటికప్పుడే ఉత్తర్వులను అందజేశారు. ఏలూరు జిల్లా ఈ ప్రక్రియలో రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందని ఆయన కొనియాడారు.

గత ప్రభుత్వ హయాంలో రాజకీయ కారణాలతో చేర్చిన భూములకు విముక్తి కలిగిస్తున్నామని, మిగిలిన 202 దరఖాస్తులను 15 రోజుల్లోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తోందని స్పష్టం చేశారు.