చింతూరు మండలం లక్కవరంలో వ్యక్తి దారుణ హత్య.

0
2

చింతూరు మండలంలోని లక్కవరం గ్రామంలో గురువారం ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. రమేష్ అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి అత్యంత కిరాతకంగా హతమార్చారు. అయితే, ఈ హత్య వెనుక ఒక గగుర్పొడిచే గతం ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు.గత ఏడాది ఇదే లక్కవరం గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు హత్యకు గురయ్యారు.

ఆ సమయంలో “క్షుద్రపూజలు చేస్తున్నాడనే” నెపంతో రామయ్యను చంపినట్లు రమేష్‌పై ఆరోపణలు వచ్చాయి. రామయ్య హత్య కేసులో రమేష్ నిందితుడిగా కూడా ఉన్నాడు.రామయ్య హత్యకు ప్రతీకారంగానే ఇప్పుడు రమేష్‌ను గుర్తుతెలియని వ్యక్తులు టార్గెట్ చేసి అంతం చేశారని గ్రామస్థులు భావిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మోతుగూడెం పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

 

# Yadagiri