Bapatla జిల్లాలో భూమి రికార్డుల తారుమారుపై రైతు తూబాటి శివకోటేశ్వరరావు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అన్నం బోట్లవారి పాలెం గ్రామంలో తనకు చెందిన 1.39 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ రికార్డుల్లో సక్రమంగా ఉన్నప్పటికీ, వెబ్‌ల్యాండ్ ఆన్‌లైన్ రికార్డుల్లో కేవలం 0.68 సెంట్లు మాత్రమే చూపిస్తున్నట్లు తెలిపారు.
ఈ తప్పిదాన్ని ఆసరాగా చేసుకుని కొందరు తన భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చెన్నపాటి కోట సుబ్బారావు తదితరులు మట్టి తోలుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. రికార్డులు సరిచేసి రక్షణ కల్పించాలని జిల్లా అధికారులను కోరారు.










