డిజిటల్ డోర్ నంబరింగ్‌పై సిబ్బందికి ప్రత్యేక శిక్షణ |

0
6

క్యూఆర్ కోడ్ డిజిటల్ డోర్ నంబరింగ్‌పై సిబ్బందికి శిక్షణ

విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) సృజన ఆధ్వర్యంలో సర్కిల్ 1, 2, 3 సిబ్బందికి ‘క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ డోర్ నంబరింగ్ వ్యవస్థ’పై శనివారం ప్రత్యేక శిక్షణ నిర్వహించారు.

రాష్ట్రవ్యాప్తంగా అమలు కానున్న ఈ విధానం ద్వారా నగరంలోని ప్రతి ఆస్తికి సాంకేతిక గుర్తింపునిచ్చి, ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన పౌర సేవలు అందించడమే దీని ముఖ్య లక్ష్యం. శిక్షణలో భాగంగా రోడ్ల మ్యాపింగ్, ఆస్తి వివరాల సేకరణ, జియో-ట్యాగింగ్, క్యూఆర్ కోడ్ జనరేషన్ వంటి అంశాలపై వార్డు సెక్రటరీలు, అధికారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్లు శర్మ, హెలెన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.