డివిజన్లో ప్రతి సమస్యను పరిష్కరిస్తాం

0
5

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 55వ డివిజన్‌లో ఎంపీ కేశినేని చిన్ని ఆదేశాల మేరకు శనివారం ‘ప్రజా దర్బార్’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూర్ బాషా కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.ఎస్. బేగ్ పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.

కార్యక్రమానికి ప్రజలు పెన్షన్లు, రేషన్ కార్డులు, గత ప్రభుత్వ అవకతవకలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. త్వరలోనే రానున్న ప్రభుత్వ కొత్త పెన్షన్ విధానం ద్వారా అర్హులకు న్యాయం చేస్తామని నేతలు భరోసా ఇచ్చారు. అధికారులు, నాయకులు ఒకే చోట ఉండటం వల్ల సమస్యలు వేగంగా పరిష్కారమవుతాయని, జీవో 30 ద్వారా విజయవాడ ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఇందులో పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు.