గుంటూరు చంద్రమౌళి నగర్‌లో ఆధునికీకరించిన పోస్టాఫీస్‌ను కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రారంభించారు. అనంతరం కొమ్మినేని గార్డెన్స్‌లో జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పోస్టాఫీసులు కేవలం ఉత్తరాలకే పరిమితం కాకుండా, డిజిటలైజేషన్‌తో కార్పొరేట్ స్థాయి సేవలను అందిస్తున్నాయని కొనియాడారు. మారుమూల గ్రామాలకు సైతం నాణ్యమైన సేవలు చేరువ కావడం కేంద్ర ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనమన్నారు. బ్యాంకింగ్, కొరియర్, ప్రభుత్వ పథకాల అనుసంధానం, పాస్‌పోర్ట్ దరఖాస్తుల వంటి ఆధునిక బహుముఖ సౌకర్యాలు ఇప్పుడు ఒకేచోట లభిస్తున్నాయని వివరించారు. కాలానుగుణంగా సాంకేతికతను సంతరించుకుని ప్రజలకు మరింత చేరువవుతున్న ఈ ఆధునిక పోస్టల్ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపునిచ్చారు.










