మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మూడు నెలలుగా కొనసాగుతున్న “మీ సురక్ష” అప్లికేషన్‌పై అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు.
గార్డెన్ మల్టీ డిగ్రీ కాలేజీ విద్యార్థులు, ఇన్‌స్పెక్టర్ వీర బాబు మరియు సంబంధిత సైబర్ ఎస్‌ఐల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 20 కాలనీలలో ప్రజలకు అవగాహన కల్పించారు.
ముఖ్యంగా కాలనీల్లో నివసించే వ్యక్తుల వివరాలు, యువ మిత్రుల సమాచారం, ఇళ్లలో పనిచేసే వాచ్‌మెన్‌లు, డ్రైవర్లు మరియు ఇతర సిబ్బంది వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.
ఈ విధంగా వివరాలు సేకరించడం ద్వారా నేరాలను ముందుగానే అరికట్టడంతో పాటు, అనుమానాస్పద ఘటనలను తక్షణమే పోలీసులకు చేరవేయడంలో సహాయపడుతుందని అధికారులు తెలిపారు.
అవగాహన కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రవీందర్ రెడ్డి తదితర అధికారులు కూడా పాల్గొన్నారు.
డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఆల్వాల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రజల్లో భద్రతా చైతన్యాన్ని పెంపొందించడంలో ఉపయోగకరంగా నిలిచింది.
#Sidhumaroju
Alwal










