ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: అదనపు ఎస్పీ.

0
5

అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించారు. అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు, వృద్ధులు, వికలాంగులు, మహిళల కేసులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఇద్దరు దివ్యాంగుల ఫిర్యాదులు స్వీకరించి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.