చింతూరులో రోడ్డుపై వారి వారి నాట్లు వేసి నిరసన!

0
2

చింతూరు గొల్ల బజార్ రోడ్డులో వరి నాట్లు వేసి నిరసన తెలుపుతున్న ప్రజలు చింతూరు గత పది సంవత్సరాల నుండి రోడ్డు సౌకర్యం లేక ఎస్టి గొల్ల బజారు కాలనీవాసులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. అనేకసార్లు ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి రోడ్డు సమస్యను తీసుకువెళ్లేనా కానీ నామమాత్రంగా తూతూ మంత్రంగా గుంటలు పూడ్చుతున్నారు.

ప్రభుత్వాలు మారుతున్నాఈ. పాలకులు మారుతున్నారు అధికారులు రిటైర్మెంట్ కూడా అవుతున్నారు కానీ రోడ్డు సమస్య మాత్రం అలాగే ఉండిపోయింది. నిత్యం విద్యార్థులు వృద్ధులు మహిళలు బీసీ కాలనీ నుండి గొల్ల బజారు మీదుగా ఇదే రోడ్డుపై నడవాల్సి ఉండగా కాలు పెడితే జారీ పడిపోయే విధంగా రోడ్డు బురద మయంగా మారి ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా మారింది. దీనికి నిరసనగా మంగళవారం బిసి గొల్ల బజార్ కాలనీ ప్రజలు బురద మయంగా ఉన్న రోడ్డుపై నిరసనగా వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఇ ప్పటికైనా అధికారులు పాలకులు రోడ్డు సమస్యపై దృష్టి సారించి త్వరితగతిన సిసి రోడ్డు ఏర్పాటు చేయాలని లేని పక్షంలో రానున్న స్థానిక ఎన్నికలను ఊకుమ్మడిగా బహిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.

 

# Yadagiri