గల్ఫ్, విదేశీ కార్మికుల క్షేమమే ఏపీ ప్రభుత్వ లక్ష్యం

0
3

గల్ఫ్ వలసదారులు, విదేశీ కార్మికుల సంక్షేమం కోసం సమగ్ర ఎన్నారై విధానాన్ని రూపొందించేందుకు తెలంగాణ ఉన్నత స్థాయి ఎన్నారై సలహా కమిటీ ఏపీలో పర్యటించింది. బుధవారం తాడేపల్లిలో ఏపీ ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఏపీఎన్ఆర్టీఎస్ అధికారులతో ఈ కమిటీ సమావేశమైంది.

ప్రవాసాంధ్రుల కోసం ఏపీ ప్రభుత్వం అందిస్తున్న అత్యవసర సహాయక చర్యలు, బీమా, పునరావాస పథకాలు మరియు ‘ఓఎంకాప్’ ద్వారా కల్పిస్తున్న సురక్షిత ఉపాధి అవకాశాలను కమిటీ అధ్యయనం చేసింది. మోసపూరిత ఏజెంట్లపై తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకుంది. ఈ క్షేత్రస్థాయి పరిశీలన ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే సమగ్ర ఎన్నారై విధానాన్ని రూపొందించడానికి తుది నివేదిక సమర్పించనుంది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు.