లక్సెట్టిపేటలో కార్డన్ సెర్చ్: 47 వాహనాలు స్వాధీనం

0
4

లక్సెట్టిపేట పట్టణంలోని పాత బస్టాండ్, మహాలక్ష్మివాడ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే లక్ష్యంగా పోలీసులు సోమవారం తెల్లవారుజామున ముమ్మర కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సిఐ రమణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ విస్తృత తనిఖీల్లో సరైన పత్రాలు లేని 46 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ.. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి, వాహన పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. నేరాల అదుపునకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, వేసవి సెలవుల్లో ఊర్లకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు వహించాలని కోరారు. ఈ తనిఖీల్లో పలువురు ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.