భారత్ అవాజ్ న్యూస్.: వరంగల్ జిల్లా నర్సంపేట దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కూల్చివేత పై వీడిన ఉత్కంఠ..నర్సంపేట లో దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించిన పోలీసులు….అర్ధరాత్రి భారీ బందోబస్తు మధ్య 3 గంటలకు పెద్ది విగ్రహాన్ని తొలగింపు.
పరిసరాల్లో బారికేడ్లను ఏర్పాటు చేసి భారీ బందోబస్తు మధ్య విగ్రహం తొలగింపు..పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం స్థలం లో విగ్రహం పెట్టిన ఆనవాళ్లు సైతం కనిపించలేదు..పరిసర ప్రాంతాల్లో అనుమతి నిరాకరణ….పోలీసులకు సైతం సెల్ ఫోన్లు అనుమతించని అధికారులు….నర్సంపేట పరిసర ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు పహారా .. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము









