మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మచ్చ బొల్లారం స్రవంతి నగర్లో ఒక యువతి అనుమానాస్పద స్థితిలో కనిపించకుండా పోయిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
స్రవంతి నగర్ ప్లాట్ నెంబర్ 419లో నివాసం ఉంటున్న కొత్తపల్లి మంజుల కుమార్తె సునీత (20) ఈ నెల 19వ తేదీ ఉదయం నుండి అకస్మాత్తుగా అదృశ్యమైంది.
ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో తల్లి మంజుల స్నానానికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో ఉన్న సునీత కనిపించకుండా పోయింది. యువతితో పాటు ఆమె బట్టలు, మొబైల్ ఫోన్ కూడా మాయమవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.
బాధిత కుటుంబ సభ్యులు తమకు తెలిసిన ప్రాంతాలతో పాటు సొంత ఊరిలోనూ సునీత కోసం గాలించినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు.
అయితే, గతంలో సునీత తాను ప్రవీణ్ అనే యువకుడిని ప్రేమిస్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తూ యువతి తల్లి గురువారం సాయంత్రం అల్వాల్ పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, యువతిని సురక్షితంగా కనిపెట్టేందుకు దర్యాప్తును వేగవంతం చేశారు.
#Sidhumaroju
Alwal







