జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఏపీడబ్ల్యూజేఎఫ్ పోరాటం.

0
6

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) నిరంతరం పోరాటాలు నిర్వహిస్తోందని రాయలసీమ జిల్లాల ఇన్‌చార్జ్ కవరకుంట్ల జయరాజ్ గురువారం తెలిపారు.

మదనపల్లెలో జిల్లా అధ్యక్షుడు రమేష్ రాయల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏప్రిల్ 7న పీలేరు పట్టణంలో అన్నమయ్య జిల్లా తొలి మహాసభ నిర్వహించాలని నిర్ణయించారు. జర్నలిస్టుల సంక్షేమం, పెండింగ్ సమస్యల పరిష్కారంపై పోరాటం కొనసాగుతుందని నాయకులు తెలిపారు.