అన్నమయ్య జిల్లాలోని సివిల్ సప్లయిస్ పాయింట్లలో పనిచేస్తున్న హమాలీలకు ఏప్రిల్ నెల వేతనాలు ఇంకా చెల్లించకపోవడం అన్యాయమని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ విమర్శించారు.
గురువారం జిల్లా సివిల్ సప్లయిస్ కార్యాలయంలో అసిస్టెంట్ మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. హమాలీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల మొదటి వారంలోనే జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. హమాలీలకు ఈఎస్ఐ అమలు చేయడంతో పాటు ఇంటి స్థలాలు, గృహాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.










