గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించాలి.. గణేశ్ నాయక్.

0
3

మదనపల్లెలో గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతూ గిరిజన విద్యార్థి సంఘం నాయకులు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గణేశ్ నాయక్తో పాటు నాయకులు అమరేంద్ర నాయక్, రఘు నాయక్ మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా గిరిజన తండాలలో నివసిస్తున్న లంబాడీలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని వారు పేర్కొన్నారు. గిరిజనుల హక్కులను పరిరక్షిస్తూ వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వాలు సహకరించాలని కోరారు.