ఆసిఫాబాద్/కెరమెరి (భారత్ ఆవాజ్ న్యూస్ – ప్రతినిధి జగదీష్):తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు జూన్ 2వ తేదీన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనను అత్యంత విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క పిలుపునిచ్చారు.శుక్రవారం కెరమెరి మండలం కేస్లాగూడ గ్రామంలో గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై నాయకులకు.
కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ.. జూన్ 2న కాగజ్‌నగర్ ఎక్స్ రోడ్డులో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఈ సభకు ప్రతి గ్రామ పంచాయతీ నుండి ప్రజలు, రైతులు, మహిళలు మరియు కాంగ్రెస్ శ్రేణులు సమష్టిగా కృషి చేసి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు:తులసిరాం, బాపూరావ్, కెరమెరి ఉప సర్పంచ్ వాగ్మారే శ్రీకాంత్, అమూల్, బలిరాం, కాంగ్రెస్ నాయకులు రాథోడ్ శంకర్ నాయక్, రాథోడ్ సుదర్శన్, కోవ ఇందిరా, రాథోడ్ శంకర్ నాయక్, మందాడే విశ్వనాథ్, నాగేష్, గిడ్డప్ప, మురళి, జగన్నాథ్ రావు, చౌహాన్ శంకర్, కేశవ్, చాహకటి జంగు, భీంరావు, ఆత్రం ఆనంద్ రావు తదితరులు పాల్గొన్నారు.








