నిమ్మనపల్లిలో ట్రాక్టర్‌పై నుంచి పడి మహిళకు తీవ్ర గాయాలు.

0
3

నిమ్మనపల్లి మండలంలో శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి పడిపోయి ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనలో గౌరమ్మ(50)కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు అదే గ్రామానికి చెందిన ఓ ట్రాక్టర్ యజమాని కూలి పనులకు గౌరమ్మను పిలవడంతో సహచర కూలీలతో కలిసి ట్రాక్టర్‌లో వెళ్లింది.

జాండ్రపాళెం వద్ద ట్రాక్టర్‌పై కూర్చుని వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.