మదనపల్లెలో దళిత నేత అరెస్టు నిరసన: సంఘాల ఆందోళన|

0
0

మదనపల్లె: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ పోలీసు రాజ్యం నడుస్తోందని దళిత సంఘాల నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. దళిత నేత, బహుజన సేన అధ్యక్షుడు శ్రీచందును తప్పుడు కేసులో అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించడాన్ని ఖండిస్తూ గురువారం మదనపల్లె ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో భారతీయ అంబేడ్కర్ సేన (బాస్) వ్యవస్థాపకుడు పీటీయం శివప్రసాద్,

 

సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఎం. బాలాజీ, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాలకుంట శ్రీనివాసులు, రాష్ట్ర గిరిజన సమాఖ్య అధ్యక్షుడు కోనేటి దివాకర్‌రావు, బహుజన సేన ప్రతినిధి భానుప్రకాశ్ పాల్గొని మాట్లాడారు.

 

శ్రీచందుపై నమోదు చేసిన కేసులో నేరం జరిగిన తేదీ, సమయం, స్థలం వంటి ప్రాథమిక వివరాలు కూడా లేకుండానే కేసు నమోదు చేశారని, ఫిర్యాదుదారుతో మాట్లాడకుండానే దళిత నాయకుడిని అరెస్ట్ చేయడం చట్టవిరుద్ధమని ఆరోపించారు. కేసు నమోదు చేసిన స్టేషన్ హౌస్ ఆఫీసర్, దర్యాప్తు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.