ఆసిఫాబాద్‌లో ఘనంగా అంబలి పంపిణీ: సేవా స్ఫూర్తిని చాటుతున్న UBY ఫౌండేషన్

0
10

ఆసిఫాబాద్, మే 24 (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ ): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మండుతున్న ఎండల నేపథ్యంలో సామాన్య ప్రజలు, బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ఒక గొప్ప మానవతా కార్యక్రమం శనివారం నాడు ఘనంగా ప్రారంభమైంది. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద UBY ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబలి పంపిణీ కేంద్రాన్ని ఆసిఫాబాద్ మాజీ ఎంపీపీ బాలేష్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ.

UBY ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఉబేద్ బిన్ యహియా (తారిఖ్) గారి పదేళ్ల అద్వితీయ సేవా నిరతిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ రోజుల్లో రూపాయి స్వార్థం లేకుండా పని చేసేవారే అరుదుగా ఉన్నారని, అలాంటిది గత 10 ఏళ్లుగా నిరంతరాయంగా ప్రజాసేవకే అంకితమవ్వడం తారిఖ్ గారి నిరుపమాన సేవా గుణానికి నిదర్శనమని కొనియాడారు.సమాజంలో కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో, ప్రజాసేవలో ఆయన ఎప్పుడూ ముందుంటారని.. ఆయన పదేళ్ల సుదీర్ఘ సేవా ప్రస్థానం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.ఈ సేవా కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉబేద్ బిన్ యాహియా (తారిఖ్)  గారితో పాటు నాయకులు కలేవర్ రాజేంద్ర ప్రసాద్ గారు,UBY ఫౌండేషన్ సభ్యులు మరియు  ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.