కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన తేదీ మార్పు

0
11

భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్): ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటన తేదీలో మార్పు చోటుచేసుకుంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం జూన్ 2వ తేదీన కాకుండా, ఒక రోజు ముందుగానే అంటే జూన్ 1వ తేదీన ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించనున్నట్లు డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ఒక ప్రకటనలో తెలిపారు.కొలాం ఆదివాసీలకు ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా కెరమెరి మండలం .

కొఠారి గ్రామంలో కొలాం ఆదివాసీల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 28 ఇందిరమ్మ ఇళ్లను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రారంభించనున్నారు.కాగజ్‌నగర్‌లో భారీ బహిరంగ సభగృహాల ప్రారంభోత్సవం అనంతరం, కాగజ్‌నగర్ ఎక్స్ రోడ్స్ వద్ద ఏర్పాటు చేయబోయే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ సందర్భంగా అక్కడకు చేరుకునే ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు.విజయవంతం చేయాలని కాంగ్రెస్ పిలుపుముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా విజయవంతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని ఆత్రం సుగుణక్క పిలుపునిచ్చారు.