పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, బంగ్లా గ్రామంలో ఆదివారం అరుదుగా కనిపించే మే పుష్పం వికసించింది. ఈ పుష్పాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల ప్రజలు ఆసక్తి చూపారు.
ప్రతి సంవత్సరం మే నెలలో మాత్రమే ఈ పుష్పాలు వికసిస్తాయని ఇంటి యజమాని శివయ్య నాయుడు తెలిపారు. ఈ పువ్వు చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉందని ప్రజలు అభిప్రాయపడ్డారు#కొత్తూరు మురళి.









