Madanapalle: మదనపల్లె మండలం కొత్తవారిపల్లె పంచాయతీ గాజులవారిపల్లెలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు సహదేవ (మంగళవారం) రాత్రి హత్యకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సహదేవ తరచూ మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవ పడుతుండేవాడని, ఈ క్రమంలో ఆయన కుమారుడు సంతోష్ తీవ్రంగా కొట్టడంతో సహదేవ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు సంతోష్ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Home Andhra Pradesh Madanapalle: మదనపల్లె మండలం గాజులవారిపల్లెలో దారుణం. మద్యం తాగి గొడవ చేస్తున్న తండ్రి సహదేవను కొట్టి...










