కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఏపీ పర్యటన

0
4

కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు అమరావతికి వచ్చారు. రాష్ట్ర మంత్రి సవితతో కలిసి ఆయన కృష్ణా జిల్లా వట్టిగూడుపాడు వద్ద ఉన్న స్పిన్ టెక్స్ పరిశ్రమను సందర్శించి, పరిశీలించారు.

అనంతరం, అమరావతి రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కేంద్రమంత్రి భేటీ అయ్యారు. ఆ తర్వాత విజయవాడలో మంత్రి సవితతో కలిసి చేనేత, జౌళి శాఖల ప్రగతిపై ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తన పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు.