విజయవాడ అంటేనే విద్యలవాడ: ఎంపీ కేశినేని చిన్ని
విజయవాడ లబ్బీపేటలో టీవీ9, క్యాబ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఎడ్యుకేషనల్ ఎక్స్‌పోను ఎంపీ కేశినేని చిన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేఎల్ యూనివర్సిటీ విద్యార్థికి ₹88 లక్షల ప్యాకేజీ రావడం గర్వకారణమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన ప్రకారం దేశానికి ‘ఆంధ్రప్రెన్యూర్స్’ కావాలని, ‘వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్’ విధానంతో ప్రతి కుటుంబం నుండి ఒక పారిశ్రామికవేత్త రావాలని ఆకాంక్షించారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా యూనివర్సిటీలు ఏఐ, రోబోటిక్స్, క్వాంటం కంప్యూటింగ్ కోర్సులపై దృష్టి పెట్టాలని సూచించారు. త్వరలోనే విశాఖపట్నం గూగుల్ ఏఐ డేటా సెంటర్ హబ్‌గా మారనుందని, అలాగే రాష్ట్రానికి త్వరలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీ రాబోతుందని ఎంపీ తెలిపారు. రతన్ టాటా పేరుతో 5 ఇన్నోవేషన్ హబ్‌లను ఏర్పాటు చేస్తున్నామని, విద్యార్థులు ఈ అవకాశాలను వాడుకోవాలని పిలుపునిచ్చారు.










