మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి |

0
0

మాదకద్రవ్యాల ముప్పుపై ఉక్కుపాదం: కలెక్టర్, సీపీ పిలుపు

మాదకద్రవ్యాల మహమ్మారి నుండి యువతను రక్షించి, జిల్లాను ‘డ్రగ్స్ రహిత’గా మార్చడమే లక్ష్యమని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు స్పష్టం చేశారు. శనివారం నిర్వహించిన ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ సమావేశంలో వారు మాట్లాడారు.

జిల్లాలోని 150 హాట్‌స్పాట్లలో రాత్రివేళల్లో నైట్ విజన్ డ్రోన్లతో నిఘా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. డ్రగ్స్ వల్ల కలిగే శారీరక, మానసిక నష్టాలపై విద్యాసంస్థల్లో ‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్’ ద్వారా అవగాహన పెంచాలన్నారు. సమాచారం కోసం 1972 టోల్‌ఫ్రీ నంబర్‌ను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. డ్రగ్స్ సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ తెలిపారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాల నివారణ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు