ప్రతిభావంతులకు పురస్కారాల పంపిణీ: మంత్రి సవిత

0
5

ప్రతిభావంతులైన విద్యార్థులకు పురస్కారాలు: మంత్రి సవిత

గుంటూరులోని దేవర సాయి కృష్ణ కల్యాణ మండపంలో టెన్త్, ఇంటర్‌లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన 104 మంది కురుబ, కురుమ, కురవ సామాజిక వర్గాల విద్యార్థులకు రాష్ట్ర మంత్రి ఎస్. సవిత భక్త కనకదాస ప్రతిభ పురస్కారాలు, నగదు బహుమతులను అందజేశారు. తన తండ్రి పేరిట ఉన్న ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ద్వారా నలుగురు టాపర్లకు రూ.25 వేల చొప్పున లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని, అలాగే 200 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులను ఆమె పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను కార్పొరేట్‌కు ధీటుగా తీర్చిదిద్దుతోందని, హాస్టళ్లలో వసతులను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని సమాజం గర్వించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.