రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
గుడ్లవల్లేరు మండలం విన్నకోట గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ కాలువ పూడికతీత పనులను గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శనివారం పరిశీలించారు. అధికారులతో కలిసి కిలోమీటర్ దూరం కాలినడకన నడుస్తూ కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సమీప పంట పొలంలో ట్రాక్టర్‌తో దుక్కు దున్నుతూ వ్యవసాయ పనులను ఆయన ప్రారంభించారు. వర్షాకాలం ముందే పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామన్నారు.
అనంతరం గ్రామంలోని శ్రీ జనార్ధన స్వామి దేవస్థాన నూతన ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకారంలో పాల్గొని, చైర్మన్ బెజవాడ నెహ్రూ బాబుతో పాటు సభ్యులను అభినందించారు










