🎤కొమురం భీమ్ ఆసిఫా జిల్లా భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
కాగజ్‌నగర్:
రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ తెలిపారు. కాగజ్‌నగర్ పట్టణంలోని వినయ్ గార్డెన్స్ నందు పోలీస్ అధికారులతో ప్రత్యేక బ్రీఫింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సీఎం పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ప్రతి ఒక్క అధికారి మరియు సిబ్బంది తమకు కేటాయించిన డ్యూటీ పట్ల కచ్చితమైన నిబద్ధతతో వ్యవహరించాలని ఆదేశించారు. ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ మరియు వీఐపీ సెక్యూరిటీ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, విధుల్లో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు.ఈ సమన్వయ బ్రీఫింగ్ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్, జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) చిత్రరంజన్, స్థానిక డీఎస్పీలు మరియు ఇతర ఉన్నతాధికారులతో పాటు పెద్ద సంఖ్యలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.







