పోలవరం జిల్లా చింతూరు సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC) సూపరింటెండెంట్, ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎం.వి. కోటి రెడ్డి గారు ఈరోజుతో తన సుదీర్ఘ సేవలకు విరామం ప్రకటించారు. ఆయన పదవీ విరమణ సభ అత్యంత వైభవంగా జరిగింది. చింతూరు మారుమూల గిరిజన ప్రాంతం. ఇక్కడి ప్రజలకు వైద్యం అందించడంలో డాక్టర్ కోటి రెడ్డి గారు చేసిన కృషి ఎనలేనిది.
ఎంబిబిఎస్ పూర్తి చేసి, ఎంతోమంది పేద రోగుల గుండెల్లో దేవుడిగా నిలిచారు. ఆయన పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు పలువురు రాజకీయ ప్రముఖులు, అధికారులు, వైద్య సిబ్బంది మరియు స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చారు.సభలో పాల్గొన్న ప్రముఖులు ఆయన చేసిన నిరంతర సేవలను, రోగుల పట్ల ఆయనకున్న నిబద్ధతను ప్రత్యేకంగా కొనియాడారు. గిరిజన ప్రాంతంలో మౌలిక వసతులు సరిగా లేకపోయినా… వెనకడుగు వేయకుండా డాక్టర్ కోటి రెడ్డి గారు అందించిన ఉచిత, నాణ్యమైన వైద్య సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుచేసుకున్నారు. శాలువాలు, పూలమాలలతో ఆయనను ఘనంగా సత్కరించి, భావోద్వేగాల మధ్య వీడ్కోలు పలికారు.










