ఆదోని పట్టణంలో కార్పొరేట్ నారాయణ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ సెలవు దినాల్లో కూడా అడ్మిషన్లు పేరుతో క్యాంపెయిన్ టీచర్లతో పని చేయించుకోవడం అలాగే ఎలాంటి సర్టిఫికెట్స్ లేకుండా ఆధార్ కార్డ్స్ తో అడ్మిషన్లు చేయించుకుంటూ పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్,బూట్లు, మరియు అనేక రకాలుగా టెక్నో కోర్సులు మరియు ఒలంపియాడ్ పేర్లతో. విద్యార్థుల తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి అధిక ఫీజులు ను దోపిడి చేస్తూ వసూలు చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో నారాయణ పాఠశాలలో ఎక్కడో ర్యాంకులు సాధిస్తే మా పాఠశాలకు
ఇంత ర్యాంక్ వచ్చిందని ఆదోని పట్టణంలో నారాయణ పాఠశాల టీచర్లతో పాంప్లెట్లు పంచుతూ ప్రచారాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాగే ప్రభుత్వ నిబంధనలను లెక్కచేయకుండా ఫీజులు పట్టిక కూడా లేకుండా ర్యాంకుల పేరుతో ప్రచారం చేసుకుంటూ విద్య అంటే అంగట్లో సరుకుగా మార్చడం జరిగింది. విద్యహక్కు చట్టాన్ని నీరు కారుస్తున్నటువంటి నారాయణ పాఠశాలపై తక్షణమే ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (DSF)విద్యార్థి సంఘంగా ఉన్నత విద్యాశాఖ అధికారులను కోరుతున్నాము.లేని ఎడల నారాయణ పాఠశాల ముందు విద్యాశాఖ కార్యాలయాలు ముందు దశల వారి కార్యక్రమాలకు సిద్ధమవుతాం అని, తెలియజేస్తున్నాము.










