చీరాల N.R.& P.M. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రౌండ్ నందు ఆంధ్రరత్న శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య 137 వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు .
పోలుదాసు రామకృష్ణ మాట్లాడుతూ చీరాల,పేరాల గ్రామ పంచాయతీలను బ్రిటిష్ వారు మున్సిపాలిటీ చేసి, ఇంటి పన్ను విపరీతముగా పెంచిన సందర్భంలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఉద్యమానికి నాయకత్వం వహించి పదిహేడు వేల మంది ప్రజలను, సొంత యిండ్లు వదిలి పెట్టి, రామడండు పేరుతో ఆయన వెంట నడిచి రామానగర్ లో పూరి పాకలు నిర్మించుకొని, 11నెలల పాటు, ఎండలను,వానలను లెక్క చేయకుండా పాములు, మండ్ర గబ్బల మధ్య కాపురం చేసిన ప్రజలు ఏక ట్రాటిమీద నిలబడడం జరిగింది. భారతదేశంలో స్వాతంత్య్ర ఉద్యమంలో చీరాల,పేరాల ఉద్యమం ప్రదానఘట్టం అయి,మహాత్మాగాంధీ ప్రశంసలు అందుకున్నారు. బ్రిటిష్ వారి నిరంకుశత్వానికి నిరసనగా ఆంధ్ర రాష్ట్రం అంతా పర్యటించి, బరంపురం లో నిషేధాజ్ఞలు ఉల్లంఘించి సభ పెట్టినందుకు, బ్రిటిష్ వారు అరెస్టు చేసి ఒక సంవత్సరం జైలు శిక్ష విధించి, తిరుచునాపల్లి జైలులో వుంచి నపుడు ఉద్యమం నీరు గారి పోయింది.జైలు నుండి విడుదలయ్యాక,చీరాల,పేరాల ఉద్యమ రథసారథి 39 సంవత్సరాలకే క్షయ వ్యాధితో కన్నుమూశారు.
బాపట్ల జిల్లా కి ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ, గత సంవత్సరం రెవెన్యూ డివిజనల్ అధికారి గారికి వినతి పత్రం అందజేసినాము. వారి పేరు మీద వున్న నిధులతో కోదండరామ ఆలయం, గ్రంధాలయం ఏర్పాటు చేయాలని వాకర్స్ అసోసియేషన్ కోరుచున్నది.సభ్యులకు పండ్లు,బిస్కట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో పొలుదాసు రామకృష్ణ, చారగుళ్ళ గురుప్రసాద్, వలివేటి మురళీకృష్ణ,తిరుపతిరావు,నారాయణమూర్తి,వీరాంజనేయులు,చలపతి,పూర్ణా, గుద్దంటి రమేష్,తుకారాం,శ్రీనివాసరావు,సత్యనారాయణ,జనార్ధనరావు,వాకింగ్ సభ్యులు పాల్గొన్నారు.










