తునికి ఆకు బోనస్ వెంటనే చెల్లించాలి: చింతూరు సిపిఎం కార్యకర్తల నిరసన!

0
3

2020-21 సంవత్సరానికి సంబంధించిన తునికాకు బోనస్ డబ్బులు ఇప్పటికీ కార్మికుల ఖాతాల్లో పడలేదు. దీనిపై సీపీఎం మండలాధ్యక్షుడు పల్లపు వెంకట్, నాయకుడు సీసం సురేష్ సోమవారం నాడు ‘ఏడుగురాళ్లపల్లి‘ గ్రామంలో కార్మికులతో కలిసి అత్యవసర సమావేశం నిర్వహించారు.ప్రభుత్వం ఎప్పుడో బోనస్ నిధులు విడుదల చేసినప్పటికీ, కేవలం ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ నిధులు కార్మికులకు చేరడం లేదని నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెక్కాడితే గాని డొక్కాడని గిరిజన, పేద కార్మికుల హక్కులను కాలరాస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు వెంటనే పరిష్కరించి, కార్మికుల బోనస్ సొమ్మును వారి ఖాతాల్లో వేయాలి. లేదంటే ఫారెస్ట్ ఆఫీసుల ముట్టడితో పాటు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం అని హెచ్చరించారు.

 

# Yadagiri