నిజామాబాద్: నగరం లో ఎండిన చెట్లు.

0
2

నిజామాబాద్ నగరం లో డివైడర్లపై నాటినటువంటి మొక్కలను చూసి కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ మేయర్ నీ డిల్లీకి పిలిపించుకొని అవార్డుకూడా ఇచ్చింది.BRS ప్రభుత్వ హయం లో గణేష్ బిగాల ఆధ్వర్యంలో 20కిలోమీటర్ల పైన డివైడర్లలో మొక్కలు నాటడం జరిగింది.

దానికి డ్రిప్ సిస్టమ్ ద్వారా నీటి వ్యవస్త కూడా కల్పించడం జరిగింది.అందుకే THE BEST GREEN CITY అని అవార్డ్ వచ్చింది.కానీ ఈరోజు దానికి బిన్నంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో చెట్లు ఎండిపోవడం జరిగింది.వేసవి కాలం కన్నా ముందే గణేష్ బిగాల గారు హెచ్చరించినప్పటికీ ప్రస్తుత ఎమ్మెల్యే ధన్పాల్ పెడ చెవిన పెట్టీ కనీసం పట్టించుకోలేదు.దాని పర్యవసనమే చెట్లు ఎండిపోవడం.ఇది చూసిన గణేష్ బిగాల గారు జీవన్ రెడ్డి గారు, బాజీ రెడ్డి గోవర్ధన్ గారు,VG గౌడ్ గారు మరియు BRS కార్యకర్తలు చలించిపోయి BRS పార్టీ ఆధ్వర్యం లో బిందెలతో నీళ్లు తెచ్చి చెట్లకు పోసి నిరసన తెలపడం జరిగింది.కనీసం ఇప్పటికైనా ఈ ఎమ్మెల్యే పట్టించుకొని చెట్లను కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం…

 

ఈ కార్యక్రమంలో దండు నీతుకిరణ్ శేఖర్, సిర్ప రాజు,ప్రభాకర్ రెడ్డి, సత్య ప్రకాశ్,సుజిత్ సింగ్, నవీద్ ఇక్బాల్,మతీన్ మరియు జగత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.