DSF ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది

0
2

కర్నూలు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలి.డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (DSF) ఆధ్వర్యంలో RIO గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా DSF రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ జిల్లాలో కొన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే అడ్మిషన్ల పేరుతో విద్యార్థులు, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు.ప్రభుత్వ గుర్తింపు లేకుండా నడుస్తున్న కళాశాలలను వెంటనే గుర్తించి, సంబంధిత యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అలాగే ఫీజుల దోపిడీని కూడా అరికట్టాలి. విద్యార్థుల భవిష్యత్తుతో చలగాటం ఆడుతున్నటువంటి జూనియర్ కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని DSF విద్యార్థి సంఘంగా డిమాండ్ చేయడం జరిగింది.లేనిపక్షంలో DSF విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు.