*తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ* వేడుకలను పురస్కరించుకుని నూడా (NUDA) కార్యాలయంలో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
నూడా చైర్మన్ *కేశ వేణు* గారు ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మన 38వ డివిజన్ కార్పొరేటర్ *ప్రవీణ్ యాదవ్* గారు, ఇతర కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.










