నెక్కొండ ఎస్ఐ సస్పెండ్… సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నెక్కొండ|

0
3

వరంగల్ జిల్లా నెక్కొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మహేందర్‌ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఉత్తర్వులు జారీ చేశారు. సివిల్ వివాదాల్లో అనధికారికంగా జోక్యం చేసుకోవడం, వెంకటాపురం గ్రామానికి చెందిన ఓ రైతు గొర్రెల కొనుగోలు వివాదంలో పక్షపాతంగా వ్యవహరించడం, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో ఆరోపణలు నిజమేనని తేలడంతో సస్పెన్షన్ వేశారు. గతంలోనూ ఎస్ఐపై అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, పీడీఎస్ బియ్యం లారీ మాయమైన ఘటనలో ఆయన హస్తం ఉందనే ఆరోపణలున్నాయి. విధి నిర్వహణలో క్రమశిక్షణారాహిత్యాన్ని, అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని సీపీ స్పష్టం చేశారు.