పిన్నారం గ్రామంలో నీటి ఎద్దడికి చెక్… బోర్వెల్ ప్రారంభించిన మంత్రి, ఎంపీ

0
7

కోటపల్లి, జూన్ 1: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పిన్నారం గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కలిసి ఆ కొత్తగా ఏర్పాటు చేసిన బోర్వెల్ను ప్రారంభించారు.గ్రామంలో కొంతకాలంగా తీవ్ర నీటి ఎద్దడి నెలకొనడంతో స్థానికులు సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి బోర్వెల్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. బోర్వెల్ ప్రారంభం కావడంతో గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తీరనున్నాయని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.