పరిశ్రమల అనుమతులు వేగవంతం చేయాలి: కలెక్టర్.

0
5

అన్నమయ్య జిల్లాలో పరిశ్రమల స్థాపనకు సింగిల్ డెస్క్ విధానం ద్వారా అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన డీఐఈపీసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 35 రోజుల్లో వచ్చిన 27 దరఖాస్తుల్లో 16 పరిశ్రమలకు అనుమతులు మంజూరయ్యాయని.

మిగిలిన 10 దరఖాస్తులను గడువులోపు పరిష్కరించాలని సూచించారు. ఉత్పాదక రంగానికి చెందిన 27 యూనిట్లకు రూ. 3.76 కోట్ల పెట్టుబడి రాయితీలకు కమిటీ ఆమోదం తెలిపిందని, పీఎంఈజీపీ కింద 74 యూనిట్లకు రూ. 2.26 కోట్ల మార్జిన్ మనీ విడుదల చేశామని, బ్యాంకులు పెండింగ్ రుణాలను త్వరగా మంజూరు చేయాలని కోరారు.