అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మహిళ వేషధారణతో పలువురిని మోసం చేస్తున్న మాయల మరాఠీ గ్యాంగ్ వ్యవహారం కలకలం రేపింది. గుప్త నిధులు, ప్రేతాత్మలు ఉన్నాయని.
వాటిని తొలగించడానికి శాంతి పూజలు చేయాలని నమ్మించి లక్షలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. పొత్తూరి మోహన కృష్ణమనాయుడు అలియాస్ (మధుశ్రీ, హనీ) నేతృత్వంలోని ఈ గ్యాంగ్ పలువురిని పెళ్లి చేసుకున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. ఈ మోసాల గుట్టు ఆలస్యంగా బయటపడింది.








