చింతూరు మండలం రత్నపురం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం భవన నిర్మాణం గత 10 సంవత్సరాలుగా అసంపూర్తిగానే మిగిలిపోయింది. కనీసం ప్రారంభోత్సవానికి కూడా నోచుకోకముందే ఈ భవనం ప్రస్తుతం పూర్తి శిథిలావస్థకు చేరుకుంది. స్లాబ్ పెచ్చులు ఊడిపోతుండటం, వర్షం వస్తే నీరంతా లోపలికి కారుతుండటంతో ఈ కేంద్రం ఎప్పుడు కూలిపోతుందోనని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.భవనానికి సంబంధించిన బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ పనులను మధ్యలోనే నిలిపివేశారు. తలుపులు, కిటికీలు సరిగ్గా అమర్చకపోవడం వల్ల అంగన్వాడీ కేంద్రంలో ఉంచే పాలు, గుడ్లు, చిక్కి వంటి చిన్నపిల్లల పోషకాహార పదార్థాలకు కనీస భద్రత లేకుండా పోతోందని అంగన్వాడీ టీచర్ లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు ఫోటో లో కనిపిస్తున్నట్లుగా భవనం తలుపులు, కిటికీలు లేకుండా అసంపూర్తిగా ఉంది. పసిపిల్లలు ఉండే ఈ కేంద్రంలో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోననే భయంతో, తల్లిదండ్రులు తమ పిల్లలను ఇక్కడికి పంపించడానికి తీవ్రంగా భయపడుతున్నారు.
అధికారులు స్పందించాలి:
చిన్న పిల్లల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఈ తీవ్రమైన సమస్యపై జిల్లా ఉన్నతాధికారులు మరియు సంబంధిత శాఖాధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పెండింగ్ బిల్లులను క్లియర్ చేసి, భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని లేదా గ్రామస్థులు కోరుతున్నారు.
# Yadagiri









