ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మద్యం ప్రియుల కోసం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇకపై సరికొత్త పరిమాణాల్లో 150ml, 200ml మద్యం సీసాలు మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. ప్రముఖ లిక్కర్ తయారీ కంపెనీల విజ్ఞప్తి మేరకు పాత నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్త సీసాల ప్యాకింగ్ నిబంధనలను ఖరారు చేసిన అధికారులు, ధరల విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏపీలో 90ml, 180ml, 375ml, 750ml బాటిల్స్ విక్రయాలు జరుగుతుండగా, త్వరలోనే ఈ కొత్త సైజుల సీసాలు కూడా అందుబాటులోకి రానున్నాయి.









