ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రష్యా పర్యటనలో భాగంగా ఆ దేశపు అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ ‘స్బేర్‌బ్యాంక్’ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ యెఫిమోవ్‌తో మాస్కోలో భేటీ అయ్యారు. భారత్‌లో ‘గిగాచాట్ ఏఐ’ విస్తరణ, యూపీఐ భద్రత కోసం అత్యాధునిక యాంటీ-ఫ్రాడ్ నెట్‌వర్క్ సాంకేతికతను అందించాలని లోకేష్ ప్రతిపాదించారు.
స్మార్ట్ సిటీ డిజిటల్ పరిష్కారాలతో పాటు యువత కోసం ‘స్కూల్ 21’ కోడింగ్ అకాడమీలను ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్యంగా విశాఖ ఫార్మా, వ్యవసాయ ఎగుమతిదారుల కోసం రూపాయి-రూబుల్ వాణిజ్య రుణాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనలపై స్పందించిన స్బేర్‌బ్యాంక్ యాజమాన్యం, వీటిని క్షుణ్ణంగా పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చింది.









