డ్రగ్స్ మరియు నేర రహిత సమాజ నిర్మాణానికి ప్రజల సహకారం అవసరం : డీసీపీ మంచిర్యాల ఎ. భాస్కర్

0
0

మంచిర్యాల జిల్లా సుభాష్‌నగర్‌లో ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా పోలీసు అవగాహన కార్యక్రమం జరిగింది. డీసీపీ ఎ. భాస్కర్, ఏసీపీ కిరణ్ కుమార్ హాజరై ప్రసంగించారు. యువత భవిష్యత్తును నాశనం చేసే గంజాయి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు పిల్లలపై నిఘా ఉంచాలని డీసీపీ సూచించారు. పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉంటూ, ఓటీపీలు, బ్యాంకు వివరాలు పంచుకోవద్దని.. మోసపోతే వెంటనే 1930 నంబరుకు ఫిర్యాదు చేయాలని కోరారు. మహిళల భద్రతకు పోలీస్ శాఖ ప్రాధాన్యత ఇస్తుందని, వేధింపులపై ఫిర్యాదు చేయాలన్నారు. నేరరహిత సమాజ స్థాపనలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్‌ఐ, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.