ఎన్నికల హామీలను తుంగలో తొక్కి కూటమి ప్రభుత్వం మైనారిటీలను పాతాళానికి తొక్కిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి బాజీ బాబా విమర్శించారు. విజయవాడలో జరిగిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. షాదీ ముబారక్, విదేశీ విద్య, పెన్షన్లు, కార్పొరేషన్ రుణాల వంటి హామీలను చంద్రబాబు నెరవేర్చలేదని ఆరోపించారు.
గత రెండేళ్ల బడ్జెట్ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ హయాంలో మైనారిటీలకు రూ. 23,500 కోట్లు ఖర్చు చేశారని గుర్తుచేశారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.










