హైదరాబాద్లోని బాచుపల్లి జంక్షన్ వద్ద సుమారు రూ. 141 కోట్ల వ్యయంతో నిర్మించిన 6 లేన్ల, 1.3 కిలోమీటర్ల ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడం ద్వారా మియాపూర్, నిజాంపేట, గండిమైసమ్మ మరియు మల్లంపేట రూట్లలో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
బాచుపల్లి మీదుగా ప్రయాణించే వాహనదారులకు సిగ్నల్ ఫ్రీ జర్నీ లభిస్తుంది.
మియాపూర్, గండిమైసమ్మ, ప్రగతి నగర్ వైపు వెళ్లే లక్షలాది మంది ప్రయాణికులకు ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తుంది.










