రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధికి రైజింగ్ రాయలసీమ సదస్సు

0
0

రాయలసీమ పారిశ్రామికాభివృద్ధికి ‘రైజింగ్ రాయలసీమ’ సదస్సు

రాయలసీమను పారిశ్రామిక, ఆర్థిక కేంద్రంగా మార్చే లక్ష్యంతో నిర్వహించిన “రైజింగ్ రాయలసీమ” సదస్సుకు ఏపీ బీజేపీ నేత పీవీయన్ మాధవ్, మంత్రులు సత్యకుమార్ యాదవ్, టీజీ భరత్ హాజరయ్యారు. ఎన్డీయే ప్రభుత్వం రూ. 10 వేల కోట్ల పెట్టుబడులతో రాయలసీమ అభివృద్ధికి, ఉపాధి కల్పనకు కృషి చేస్తోందని మాధవ్ తెలిపారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, తయారీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు చెప్పారు.

కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, దీనివల్ల వేలాది మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనకు మౌలిక వసతులు, పారదర్శక సేవలు అందిస్తామని మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు.